జనం న్యూస్,ఏప్రిల్14, జూలూరుపాడు:
మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ (సీనియర్స్)కార్యాలయంలో రాజ్యాంగ ప్రదాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని,సామాజిక న్యాయం మరియు వ్యక్తిగత హక్కుల సూత్రాలను పత్రంలో పొందుపరిచారని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక కార్యకర్త, ఆర్థికవేత్త, భారత రాజ్యాంగ ప్రధాత రూప శిల్పి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్ కే జానీ,ప్రధాన కార్యదర్శి చాపలమడుగు నరసింహారావు, ఉపాధ్యక్షులు తంబర్ల పుల్లారావు, సంయుక్త కార్యదర్శి కాళ్లూరు ప్రవీణ్ కుమార్,గౌరవ సలహాదారులు దిలీప్ కుమార్,కాశిమల్ల సురేష్,కోశాధికారి ఎస్.కె బుడెన్ పాషా పాల్గొన్నారు.