జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి.
వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కార్యదర్శి పీ. రామకృష్ణ ప్రకటన. వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నాం అని, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని
అఖిల భారతవ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.యు.కే.ఎం.ఎస్.) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీ. రామకృష్ణ ప్రకటించారు మంగళవారం నాడు సిర్కోండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.యు.కే.ఎం.ఎస్.) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీ. రామకృష్ణ మాట్లాడుతు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో మీనా వేశాలు లెక్కిస్తు,నిర్లక్ష్యం వహిస్తుంది అని ఆయన ఆరోపించారు. రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక, వ్యవసాయ రంగంలో యంత్రికరణ చేద్దాం అన్న పనిలేకపోవడం వల్ల పొట్ట గడవడమే గగనమైందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొన్నది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6గ్యారంటీల్లో "ఆత్మీయ భరోసా" మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం నింగిలో కెల్తూ వ్యవసాయ కూలీలు దినదినగండంగా బ్రతుకుతున్నారు అన్నారు. అర్థఆకాలితో అలమటించుతున్నారన్నారు. కనీసంగా వ్యవసాయకూలీలకు మానవతాధృక్పదంతో అలోచించి ఇస్తాం అన్న తమ హామీప్రకారం 12వేల జీవనభృతిని ఇచ్చి తమ మాటను నిలబెట్టుకోవాలి అన్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాపితగంగా మండల కేంద్రల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి తహసీల్దార్ లకు డిమాండ్స్ కూడిన మెమోరాండం సమర్పిస్తమన్నారు. విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు జి. కిషన్, ప్రధానకార్యదర్శి. ఇ. రమేష్, ఉపాధ్యక్షులు బి. కిషోర్, కోశాధికారి ఎస్. కిషోర్, జిల్లా నాయకులు కే.రాంజీ తదితరులు పాల్గొన్నారు. ఏ.ఐ.యు.కే.ఎం.ఎస్. నూతన కార్యవర్గం ఏమన్నిక అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.యు.కే.ఎం.ఎస్.) నిజామాబాద్ - కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ. ని గడ్కోల్ లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
1)అధ్యక్షులు. జి.కిషన్.
ఉపాధ్యక్షులు*: 2)బి.కిషోర్
3)బి.అశోక్
*ప్రధానకార్యదర్శి4): ఇ.రమేష్
సహాయ కార్యదర్శి: 5).జి.సాయరెడ్డి
: 6)అంబన్న .
కోశాధికారి :7)ఎస్. కిశోర్
కార్యవర్గ సభ్యులు:
*8)పెద్దన్న
9)రాంజీ
10)బాల్ రెడ్డి
11)ఎర్రన్న
12)నరేష్
13)దయల్ సింగ్
14)ప్రభాకర్
15)రాజు
16)సాయిలు
17)సర్పంచ్ లతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇట్లు
విప్లవ అభినందనలతో
ఇ. రమేష్ జిల్లాప్రధానకార్యదర్శి.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.యు.కే.ఎం.ఎస్.)