మైనారిటీ సెల్ చిన్నకోడూరు మండల ప్రధానకార్యదర్శి గా మహమ్మద్ సలీమ్
జనం న్యూస్ :15 ఏప్రిల్ మంగళవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్ నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు మాజర్ మాలిక్
చిన్నకోడూరు మండల మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ సలీమ్ నియమితులయ్యారు ఈ సందర్బంగా మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మజార్ మాలిక్ కాంగ్రెస్ చిన్నకోడూరు మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సలీమ్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ మరియు మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ కి ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, ఫిషర్మెన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట్ యూత్ కాంగ్రెస్ మాజి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్ గౌడ్, ఎస్సీ సెల్ మండల మాజీ అధ్యక్షులు నముండ్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.