జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి.
బి ఆర్ ఎస్ పార్టీ రజితోత్సవ వేడుక సన్నాహక సమావేశం బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి లోని జి కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. రూరల్ ప్రాంతంలోని కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు అందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సిరికొండ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు అన్ని మండలాల నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.. ఈ సభ యొక్క ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవంలో భాగంగా ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను కార్యకర్తలను తరలించడం కోసం దిశ నిర్దేశం చేయడం జరిగింది.