జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ ఆయాజ్ నిన్న అంబేద్కర్ జయంతి వేడుకలను, తూతూ మంత్రంగా నిర్వహించరని, అరగంటలో ముగించడం, ఏంటి అని అక్కడికి బిజెపి పార్టీ నాయకులు రాగానే ప్రోగ్రాం ముగిసింది అని, మున్సిపల్ కమిషనర్ వెళ్తుంటే, బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు జీడి మల్లేష్, ఆకుల రాజేందర్ ప్రశ్నించారు. కమిషనర్ ఆయాజ్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి బై, ఏ ఉకో, అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడటాన్ని మేము అవమానకరంగా భావిస్తున్నాము అని, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్ అన్నారు, దళిత నాయకులు అంటే మీకు ఎందుకు ఇంత చిన్నచూపు అని, ఇప్పటికైనా మీరు మాట్లాడినా, మాటలు రెండు రోజుల్లో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల కరీంనగర్ కలెక్టర్ కి, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు, ఆయన అధికార పార్టీకి ఒక విధంగా ఇతర పార్టీలను మరోరకంగా చూడటం మానుకోవాలని, మున్సిపల్ ఆఫీస్ లో మొన్న మీరు రెండు మేకలు కోసి విందు ఏర్పాటు చేయడం ఏంటని, ఆ నిధులు ఎక్కడినుంచి ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, పల్లపు రవి, కైలాసకొటి గణేష్, మోతే స్వామి, ఇటుకాల స్వరూప, బల్సుకూరి రాజేష్, రాచపల్లి ప్రశాంత్, కొమ్ము అశోక్, శ్రీవర్తి ప్రవీణ్, ముకుందా సుధాకర్, కురిమిండ్ల అశోక్, కొండపర్తి ప్రవీణ్, పొనగంటి రవి, కనుమల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..