నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం- కోట రవీందర్ రెడ్డి
జనం న్యూస్,ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఈరోజు ఐన్టియుసి అర్జీ త్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి గారి జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న మూడు నిరుపేద కుటుంబానికి ఒక నెలకు సరిపడ నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. అనంతరం మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ మేము నిర్వహిస్తున్న కార్యక్రమాలు పత్రికల, సామాజిక మాధ్యమాల చూసి పేదవారి సహాయం చేయాలనే సంకల్పంతో ఈరోజు కోట రవీందర్ రెడ్డి అభినందనీయమని తెలిపారు.అంతరం కోట రవీందర్ రెడ్డి గారి మాట్లాడుతూ మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి,సింగరేణి యువబలగం ప్రతినిధి మేకల మారుతి యాదవ్ ఆధ్వర్యంలో నిజమైన పేదలను గురించి సహాయం చేయడం మమ్ములను చలిచివేసింది అందులో భాగంగా ఈరోజు నేను నా పుట్టిన రోజు సందర్భంగా నా వంతుగా సహాయం చేస్తానని గంట వెంకటరమణ రెడ్డి గారికి తెలపడం జరిగింది.ఇతరులు కూడా మీ శుభకార్యాలలో పెద వారికి సహాయం చేసే విధంగా ఆలోచించాలి అని తెలిపారు. కార్యక్రమంలో మేకల మారుతి యాదవ్, ఐఎన్టియుసి సెంట్రల్ నాయకులు బెల్లం శ్రీనివాస్,బత్తుల రమేష్, పన్నూరు మాజీ ఎంపీటీసీ కొప్పుల గణపతి, వేముల తిరుపతి,అనవేన శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్ ,కోట నికిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.