జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
సీనియర్ రాజకీయ నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె ఇటీవల అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని మంగళవారం పరిపాటి రవీందర్ రెడ్డి స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.