జనంన్యూస్. 16. నిజామాబాదు. సిరికొండ.
తెలంగాణ గోసంగి కుల రాష్ట్ర కమిటీ… మంత్రి దామోదర రాజనర్సింహ ను. (వైద్యఆరోగ్యశాఖ & సైన్స్ అండ్ టెక్నాలజీ) హైదరాబాదులోని మినిస్టర్ హెడ్ క్వార్టర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయిచరణ్. మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో మాల.మాదిగల. తరువాత అత్యధిక జనాభా గల గోసంగి కులాన్ని 23351 జనాభాగా చూయించినారు కానీ మా జనాభా లక్షకు పైచిలుక ఉంటుందని త్వరలో మా పూర్తి జనాభా మీకు తెలియజేస్తామని మీరు ముఖ్యమంత్రి .
దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేయగలరని మంత్రి ని కోరడం జరిగింది అలాగే గతం లో మా యొక్క కుల ధ్రువీకరణ పత్రాలు ఆర్డీవో పరిధిలో ఉన్నప్పుడు చాలామందికి మా కుల సర్టిఫికెట్లు రాక ( గత్యంతరం లేని పరిస్థి తుల్లో కొద్ది మంది వేరే కుల సర్టిఫికెట్లు తీసుకొని ఉన్నారు. ఇప్పుడు వారు తిరిగి మా కుల సర్టిఫికెట్లు తీసుకొనే తరుణం లో ఎవరికి ఇబ్బంది లేకుండా తిరిగి మా గోసంగి కుల సర్టిఫికెట్లు మాకు ఇప్పించే విధంగా ప్రత్యేకచొరవ తీసుకోవాలని అలాగే త్వరలో రాబోతున్న ఉద్యోగ నోటిఫికేషన్ల విషయం లో మా గోసంగి కుల నిరుద్యోగులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి చదువుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని
అలాగే రాజీవ్ యువవికాసం మరియు ఎస్సీ కార్పొరేషన్ రుణాలలో బ్యాంకు నుండి ఎలాంటి షరతులు లేకుండా మా గోసంగి కులస్తులకు రుణాలు మంజూరు చేయాలని అలాగే నిజామాబాద్ జిల్లాలో గోసంగి కులానికి చెందని వ్యక్తులు మా కుల సర్టిఫికెట్లు తీసుకుని మాకు రావాల్సిన హక్కులు కాలరస్తున్నారని మేము 2016 నుంచి దీని పైన పోరాటం చేస్తే నేడు నిజామాబాద్ జిల్లాలో డిఎల్ఎస్ కమిటీ ఏర్పాటు జరిగింది. కానీ స్థానిక జిల్లా కలెక్టర్ .కాలాయాపన చేస్తున్న కారణం గా కమిటీ త్వరలో పూర్తిచేసి మా కులానికి న్యాయం చేసే విధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కి మంత్రి ఆదేశాలు జారీ చేయాలని అలాగే ఎస్సి 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉప కులాలకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. దీనికి మంత్రి. నుకూలంగా స్పందించి, మీ యొక్క సమస్యల పైన కచ్చితంగా, సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ర్యక్రమంలో…
తెలంగాణ రాష్ట్ర గోసంగి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి:- జన్నారపు రాజేష్ ఉపాధ్యక్షులు :- కాదాసీ అరుణ్ అధికార ప్రతినిధి:- కలమడుగు తిరుపతి గారు కోశాధికారి:- అంకమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.