జనం న్యూస్ 16 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి )
ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ సమాజంలో సగభాగానికి పైగా 56 శాతంగా ఉన్న బీసీలను మిగతా ఎస్టీ, మైనారిటీలను భాగస్వామ్యం చేయకపోవడం అత్యంత బాధాకరం అంబేద్కర్ అందరికీ మహానీయుడు అటువంటి మహనీయుని జయంతిని కేవలం ఒక ఎస్సీ వర్గం వారితో కమిటీని నియమించడం , ఆహ్వానితుల్లో గాని , వేదిక పైకి గాని బీసీ, ఎస్టీ, మైనార్టీలను ఆహ్వానించి ఆ వర్గాలకు అంబేద్కర్ చేసిన కృషిని ఆ వర్గాల వారితోనే తెలియజెప్పే అవకాశం కల్పించకపోవడం ఐక్యతకు ఆటంకం ప్రపంచ స్థాయి మహనీయుని ఒక ఎస్సీలకి పరిమితం చేయడం ద్వారా వారి స్థాయిని తగ్గించి అవమానించారు.భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు అందించడం ద్వారా ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలన్న వారి కలలు నిజం కావాలంటే అన్ని వర్గాలు చైతన్యంతో ఐక్యం కావడమే పరిష్కారం అన్న విషయాన్ని నిర్వాహకులు గుర్తించకపోవడం విచారకరం బాధాకరం అవమానకరం ఆధిపత్య వర్గాలకు ఆనందకరం.
భవిష్యత్తులోనైనా ఈ అనైక్యతను అధిగమించి నిర్వాహకులు అంబేద్కర్ అందరి వాడని నిరూపిస్తారని కేవలం మూర్తిని కొలవడం వరకే పరిమితం కాకుండా వారి స్ఫూర్తిని పొందాలని వారి ఆశయ సాధనలో అందర్నీ భాగస్వాములు చేస్తారని ఆశిస్తున్నాను. మల్లెల రామనాథం . భారత రాజ్యాంగ రక్షణ వేదిక కన్వీనర్