జనం న్యూస్ /నెక్కొండ/మొక్కజొన్న చేనుకు లద్దపురుగు సొకడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర లొ కాశ బోయిన మల్లయ్య అనే రైతు తనకు చెందిన వ్యవసాయ భూమిలో రెండెకరాల పత్తి చేను వేశాడు. అయితే అతివృష్టో, అనావృష్టో, వాతావరణము సరిగ్గా లేకపోవడం తెలియదు, కానీ పంట దిగుబడి పత్తి సరిగా రాకపోవడంతో, పత్తి చేను మొత్తం పీకి అందులో మొక్కజొన్న వేశాడు, "మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా" మొక్కజొన్న చేను వేసిన దగ్గర నుండి లద్దపురుగు సోకడంతో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. రెండు ఎకరాల మొక్కజొన్న వేయడానికి 5 సంచులు కొనుగోలు చేశాడు. ఒక్కో సంచి 2000 రూపాయలు, దుక్కిమందుకు 3000 రూపాయలు, మొదటిసారి మొక్కజొన్న పై మందు పిచికారి చేయడానికి 1700 రూపాయలు, కొంత పని చేసింది కానీ దురదృష్టవశాత్తు వర్షం పడడంతో మళ్లీ లద్దపురం తీవ్రత ఎక్కువై తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. అయితే ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే సామెత మాదిరి తన పక్క రైతు పిచికారి చేసే మందులో నిర్మాపౌడర్ మిక్స్ చేసి కొడితే పురుగు తీవ్రత తగ్గుతున్నదని తెలపడంతో గురువారం 1500 రూపాయలు లీటరు నార మందు కొనుగోలు చేసి అందులో 50 రూపాయలు పెట్టి నిర్మాణ పౌడర్ కొనుగోలు చేసి కలిపి కొట్టాడు. ఫలితం కోసం ఎదురు చూస్తున్న రైతు మల్లయ్య.