హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుంది..
ఎన్ని కేసులు పెట్టినా సిద్ధం..
బహిరంగ సభతో కాంగ్రెస్కు ప్రజల నుండి గట్టి గుణపాఠం చెప్పాలి..
జనం న్యూస్ // ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..
హుజురాబాద్ లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫిస్ లో హుజురాబాద్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు, అన్ని నియోజకవర్గాల కంటే హుజూరాబాద్ నుంచే అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని, పిలుపు నిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ సభ ద్వారా చాటిపెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మించి ప్రజలను మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామన్నారని. కానీ 16 నెలలు గడిచినా ఒక్క హామీ పూర్తిగా అమలవలేదు అని తెలిపారు. ‘‘ప్రభుత్వ హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాననని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గ ’’ అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరగట్లేదని, రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తోందన్నారు. ‘‘కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడిన రైతులను ఈ ప్రభుత్వం విస్మరించింది,’’ అని ఆరోపించారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబతారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, జమ్మికుంట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు,పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తదితర నేతలు పాల్గొన్నారు.