అమాయక ప్రజలు ఏమైతే మాకేంటి..
ఆఫీస్ కి వచ్చి నిద్రపోతారు డిస్టర్బ్ చేయకండి..
మ్యాకమల్ల అశోక్..
జనం న్యూస్ // ఏప్రిల్//16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..
హుజురాబాద్ లేబర్ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లు సుమారు 11 గంటలకు వస్తున్నారని మ్యకమల్ల అశోక్ ఆరోపించారు., ఒంటి గంటకే అన్నం, తినాలని సెటర్ వేసుకుంటున్నారన్నారు. మూడు గంటలకు అలా తెరిచినట్లు,, తెరిచి నాలుగు కాకముందే ఆఫీస్ మూసి తాళాలు వేసి వెళ్ళిపోతున్నారని తెలిపారు. లేబర్ ఆఫీస్ కి వచ్చిన ప్రజలు ఏమో ,, చెట్ల కింద ఎండకు చాలా అవస్థలు పడుతూన్నారన్నారు, వాళ్ళ సమస్యలకు సమాధానాలు చెప్పే వారు ఎవరూ లేకుండా ఏం చేయాలో, తెలియని స్థితిలో కార్మికులు బాధితులు, ఉంటున్నారన్నారు. హుజురాబాద్ లేబర్ ఆఫీస్ చుట్టూ, చాలా రోజుల నుండి తిరుగుతూ, నిరుత్సాహం చెందుతున్నారన్నారు . ఈ సమస్యను సంబంధిత అధికారులు జిల్లా అధికారులు, తక్షణమే దీనిమీద చర్య తీసుకొని ప్రజల సమస్యలను అతి త్వరలో తీర్చాలని కోరుతూన్నారు. లేబర్ సమస్యలను పట్టించుకునే వారు లేరా, అనే బాధతో కుమిలిపోతున్నారన్నా రు.. హుజురాబాద్ లేబర్ ఆఫీస్ లోని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని ఈ అధికారులను వారు సమయపాలన పాటించకపోవడం తో పాటు వచ్చిన వారిపై సమాధానాలు చెప్పలేక దురుసుగా ప్రవర్తించడం చాలా బాధాకరం అని మండిపడ్డారు. ఆఫీస్ సెటర్ కింది కి వేసుకొని నిద్రించడం జరుగుతుంది, అన్నారు. కావున మా సమస్యలను పై అధికారులు పట్టించుకోని, విరిపై తక్షణ చర్యలు తీసుకొని, ప్రజలకు మేలు చేయాలని అశోక్ కోరారు.