జనం న్యూస్,ఏప్రిల్16,అచ్యుతాపురం:
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతలు వెల్లువెత్తాయి. జనవాణి కార్యక్రమంలో వ్యక్తిగతంగా కంటే సామాజికంగా ఎక్కువ వినతలందడం విశేషం. ఈ అర్జీలను స్వయంగా ఎమ్మెల్యే తీసుకుని పరిష్కార మార్గాన్ని కూడా అక్కడే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి సమస్య రాకూడదని, సమస్య అనేది ఉంటే వెంటనే పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పరచుకొని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు ఎంపీటీసీలు,ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.