అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన అవసరం.
జనం న్యూస్, ఏప్రిల్ 16, భీమారం మండలం( ప్రతినిధి కాసిపేట రవి ):
రాజకీయాలపై తమ అభిప్రాయాలను చూపుతూ ప్రజలు మనకు అధికారం ఇచ్చేది వారిపై అధికారం చలాయించడానికి కాదని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి వినియోగించాలని తెలిపారు. తమ రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నన్ని రోజులు తన అధికారాన్ని అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఉపయోగించామని అంతేగాని అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయకూడదు నియోజకవర్గ మండల గ్రామాల స్థాయిలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజా రంజికంగా పరిపాలించలి గ్రామాల స్థాయిలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న నిధులను ఉపయోగిస్తూ వీలైనంతవరకు వారికి సౌకర్యాలు కల్పించలి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి అధికారులతో సమావేశమై నిధులు ఎంత అవసరమో తెలుసుకొని పలుమార్లు ఆ సమస్యలను సాధన సభ్యుల దృష్టికి తీసుకెళ్లి అంచలంచెలుగా నిధులు సమకూరుస్తూ ఆ సమస్యలు పరిష్కారం చేయటంలో విఫలం కాకూడదు ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ కార్యక్రమాలపై నిరంతరము అధికారులతో సమీక్షలు జరుపుతూ, పల్లె ప్రాంతాలలో పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకుని, అధికారులతో చర్చించి వీలైనంతవరకు ఆ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చెయ్యాలి తమ అధికారాన్ని చలాయించ కుండ వీలైనంతవరకు వారిని గౌరవిస్తూ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు నిరంతరం అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ ప్రజల సమస్యల పట్ల ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తూ మండలంలో గ్రామాలలో అభివృద్ధిలో అధికారులందరిని భాగస్వాములు చేస్తూ వారు సూచనలు సలహాలు తీసుకొని అందరి సహకారంతో ముందుకెళ్లాలి ప్రజలు మనకు అధికారం ఇచ్చేది వారి సంక్షేమం కొరకు, ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి, అవినీతి రహిత పాలన కొరకు మాత్రమే మనకు అధికారం ఇస్తారు,