ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 16 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిలిపి చెడు మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో చిలిపి చెడు రైతు సంఘం ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామాలు సోమలతాండ రామదాసుగూడ శీలం పల్లి గంగారం జగ్గంపేట ప్రాథమిక సహకార సంఘం సోమక్కపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాలు సోమక్కపేట బండపోతుగల్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి అని బుధవారం తెలియజేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందన్నారు దళారుల చేతులు రైతులు మోసపోవద్దని ఆమె సూచించారు ప్రభుత్వం ఒక క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి 23 20 రూపాయలు ప్రకటించిందని తెలిపారు సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గోనె సంచులు సుతిల్ తాళ్లు త్రాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్నారు అదేవిధంగా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు అధికారులు కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్కు తరలించడానికి వెంటనే రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ ప్రకటించాలని రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే ఆ రైస్ మిల్లర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు పోయినసారి రైతుల నుండి సన్న వడ్లను కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని తెలియజేశారు ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా వెంటనే పరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీవో శ్యాం కుమార్ ఎమ్మార్వో సింధుజ ఆర్ ఐ సునీల్ చౌహాన్ సోమక్కపేట సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి సీఈవో పోచయ్య మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ గౌడ్ చిలిపిచేడు రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ ఎండి యాసిన్ గోపాలరావు నారాయణ శ్రీనివాస్ రెడ్డి ఐకెపి ఎపిఎం ప్రేమలత ఐకెపి మండల అధ్యక్షురాలు సుధారాణి రేణుక బ్లాక్ సంఘం సభ్యులు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి షఫీ దుర్గారెడ్డి ఎం సివిట్టల్ శ్రీకాంత్ రెడ్డి బీసీ సెల్ మండల అధ్యక్షుడు పోశయ్య ముకుంద రెడ్డి లక్ష్మణ్ మసూదన్ రెడ్డి యాదగిరి అనంతరామ గౌడ్ మాణిక్యం గోపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంఘ గౌడ్ నారాయణ శ్రీనివాస్ రెడ్డి బిక్షపతి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు