జనం న్యూస్ // ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )..
వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ సాహెబ్ హుస్సేన్, బుధవారం నాడు జమ్మికుంట మార్కెట్ కమిటీ చేర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం ను మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం లను బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, వీణవంక మండలం మాజీ అధ్యక్షులు మహమ్మద్ సాహెబ్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వీణవంక మండలం లో రైతు సోదరుల సౌకర్యార్థం సబ్ మార్కెట్ యార్డ్ తో పాటు నిధుల మంజూరు చేయవలసిందిగా, చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం లను కోరారు. స్పందించిన చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ.. వీణవంక మండలలో రైతు సోదరుల సౌకర్యార్థం సబ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం పాటు నిధుల విషయమై, రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, కి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జి వోడితల ప్రణవ్ బాబు ల దృష్టికి తీసుకువెళ్లి సబ్ మార్కెట్ యార్డ్ నిర్మాణంతోపాటు నిధుల మంజూరుకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.