

జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం:కూటమి ప్రభుత్వంతోనే గ్రానైట్ పరిశ్రమ అభివృద్ది చెందనుందని ఆ పరిశ్రమల సంఘం ప్రతినిధులు, నిమ్మాడ సర్పంచ్ కింజరాపు సురేష్, దుర్గా గ్రానైట్స్ యజమాని చౌదరి, గోపి తదితరులు అన్నారు. బుధవారం మండలం నిమ్మాడ కూడలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌరవిమానాయాల శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులతో కూడిన నాయకుల ప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం కోవిడ్`19 ఖర్చుల నిమిత్తం సీనరీస్ చార్జీలతోపాటు పెంచిన వంధశాతం కన్స్‌డరేషన్ పన్నులు పూర్తిగా ఎత్తివేశారు. కొత్తలీజులకు 20 ఏళ్ళు నుంచి 30 ఏళ్ళుకు, రెన్యూవల్స్‌కు 15 నుంచి 20 ఏళ్ళుకు పెంచడంతో గ్రానైట్ యాజమాన్యాలకు ఊరట లభించిందని గ్రానైట్ యాజమాన్యం అనందం వ్యక్తం చేశారు. అంతకు ముందు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలువేసి ఘన నివాళులర్పించి పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద బమ్మిడి మాజీ సర్పంచ్ శిమ్మ నారాయణరావు, గ్రానైట్ పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.