Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం: కోటబొమ్మాళి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సాంఫీుక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పి. అరుణకుమారి బుధవారం ఒక స్మార్ట్‌ టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లను పాఠశాల పధానోపాధ్యాయుడు డి. గోవిందరావుకు అందజేశారు. ఉత్తరాంధ్ర యూనిట్‌గా తీసుకొని సమగ్ర శిక్ష, అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ వారు అందించిన కంప్యూటేషనల్‌ థింకింగ్‌ అండ్‌ కోడిరగ్‌ కోర్సులో అత్యుత్తమ ప్రాజెక్టు సమర్పించి అగ్రత్రయంలో స్థానం పొందినందుకు సాంఘిక శాస్త్ర అధ్యాపకురాలు పి అరుణకుమారి వారు డిజిటల్‌ స్మార్ట్‌ టీవీ, రెండు డెల్‌ కంపెనీ ల్యాప్‌ టాప్‌లు, ఒక అలెక్సా పరికరంలు బహుమతులు అందజేశారు. వాటిని పేద పిల్లల ఉన్నతి కోసం వాడుటకు పాఠశాలకు అమె అందజేసారు. వీటి సహాయంతో గ్రామీణ పిల్లలు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు.