జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
డిడి న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ ( సవరణచట్టానికి) వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీగా నిరసన తెలిపారు. కోట వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో వేలాదిమంది ముస్లిం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులను హానిచేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చినదని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది ముస్లింల ఆస్తులపై దండయాత్రగా అభివర్ణించారు. వక్ఫ్ అనేది ముస్లింల సామాజిక హక్కులకు, వారి స్వతంత్రతకు రక్షణ కల్పించే చట్టమని,దాన్ని రాజకీయం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతిచ్చారని గుర్తు చేస్తూ, మోడీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. బీజేపీ చెబుతున్న వక్ఫ్ బిల్లుతో పేద ముస్లింలకు లాభం చేకూరుతుందన్న మాటలు పూర్తిగా అబద్ధమని, ఈ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.