జనంన్యూస్. 17. నిజామాబాదు. సిరికొండ.
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మత ఫాసీజాన్ని తరిమి కోడ్దాం దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్. ఎస్.ఎస్.,బీ.జే.పీ.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం.రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ పిలుపును ఇచ్చారు.క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మత ఫాసీజాన్ని తరిమి కోడ్దాం అని, దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్. ఎస్.ఎస్.,బీ.జే.పీ.లు సృష్టిస్తున్నాయని సిరికొండలో సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్. ఎస్. ఎస్., బీజేపీ ల పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన.రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ మాట్లాడుతు. చరిత్రను వక్రీకరించి, అబద్దాలను ప్రచారం చేస్తు పాసిస్ట్ విధానాలను ఆర్. ఎస్. ఎస్., బీజేపీ లు కుట్రపూరితంగా వ్యవహారిస్తున్నాయ్ అన్నారు. ప్రజల్లో తమ విషభిజాలను నాటెందుకు సినిమాలను, సోషల్ మీడియా ద్యారా పెద్దఎత్తున సాగుస్తున్నాయ్ అన్నారు. భూమికోసం, ఎట్టి రద్దు కోసం సాగిన మహాత్తరమైన సాయుధపోరాటాన్ని కూడా ముస్లింరాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అన్నారు. స్వాత్రంత్ర పోరాటంలో ఏమాత్రం లేని ఆర్. ఎస్. ఎస్ ఈనాడు తామే దేశభక్తులం అని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తమ ఎజెండా దేశభక్తి అని చెప్తున్న ఆదాని, అంబానీ లాంటి కోటీశ్వరుల కొమ్ముకాయడానికే అన్నారు. దేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించి దేశప్రజల్ని మాత్రం మతం మత్తులో ముంచుతున్నారు అన్నారు. అసలు లౌకిక దేశం అయినా, ప్రజాస్వామిక దేశం అయినా భారత దేశం ఏమతానిది కాదు అని ఈ దేశం అన్నీ మతాలు, కులాల్లో ఉన్న శ్రమాజీవులది అన్నారు. "హిందూ - ముస్లీం - క్రిస్టియన్ - దళిత్ ఏక్ హై" అన్న స్పూర్తితో జేఏసి నీ ఏర్పాటు చేయడం కోసం మాస్ లైన్ సిరికొండ మండలం కమిటీ అలోచించడం, ముస్లిం, క్రిస్టియన్, దళితులు, ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం.రవి, ముస్లిం మండల అధ్యక్షులు లియకత్, క్రిస్టియన్ సంఘం మండల అధ్యక్షులు ఏసురత్నం, ఉపాధ్యాయ సంఘం నాయకులు వి.బాలయ్య, సీనియర్ ఉపాధ్యాయులు కే. సాలమాన్, మాస్ లైన్ పార్టీ మండల కార్యదర్శి ఆర్. రమేష్, సీనియర్ పాస్టర్స్ సంఘం నాయకులుడి. దేవదాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దెగం. సాయన్న, మైనార్టీ నాయకులు అబ్బాస్ లు ప్రసంగించగా వివిధ పార్టీల నాయకులు సల్ల. రాజారెడ్డి, గొల్ల. జనార్దన్, ఆర్. దామోదర్, ఈ. రమేష్, మొట్టల.రాము, బి. బాబన్న, జి. సాయరెడ్డి, బి. కిశోర్, అనిస్, ఎం. లింబాద్రి, ఏ.ఆశిస్, జే. బాల్ రెడ్డి, జే. ఎర్రన్న, టీ. భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.