జనం న్యూస్ ఏప్రిల్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫ్ఫైర్స్ అధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) ను అనకాపల్లి జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సి.ఎం. రమేష్ పిలుపునిచ్చారు. గత సంవత్సర బడ్జెట్ సమావేశాలలో ప్రకటించిన పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) ద్వారా కార్పొరేట్ వాతావరణంలో ప్రముఖ కంపెనీల అధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంగా పెట్టుకుంది. 21-24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం 1.25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను అందించాలనే లక్ష్యంతో 'పైలట్ ప్రాజెక్ట్' ప్రారంభమైంది. పథకం యొక్క వివరాలు www.pminternship.mca.gov.in పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన యాప్ డౌన్లోడ్ చేసుకుని యువత తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 22 ఏప్రిల్ 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఇంటర్న్‌షిప్ కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ నెలవారీ భత్యంగా 5000 రూపాయలు, వన్-టైమ్ గ్రాంట్‌గా రూ.6000 లతో పాటు, బీమా కవరేజీ కూడా అందించబడుతుంది. వికసిత్ భారత్ లో భాగంగా ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో యువతకు సాధికారత కల్పించడం ఈ పథక లక్ష్యం. కనుక అనకాపల్లి పార్లమెంటరీ నియోజక వర్గం లోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ బంగారు భవిష్యత్తుకు బాటను సుగమం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాని, అనకాపల్లి జిల్లా లోని సంబంధిత శాఖ అధికారులు కూడా ఈ పథకంపై జిల్లాలోని యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ప్రత్యేకంగా అభ్యర్ధిస్తున్నానని, ఎంపీ సి.ఎం. రమేష్ తెలిపారు.