జనం న్యూస్. ఏప్రిల్ 18. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
హత్నూర మండల పరిధిలోని కాసాల, దౌల్తాబాద్, కొన్యాల, ముచ్చర్ల, రెడ్డిపాలెం, తదితర గ్రామాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రెవరెండ్ బీ కాంతారావు, మాట్లాడుతూ 40 రోజులపాటు పవిత్రతతో ఉపవాస దీక్షలు చేపట్టి శుక్రవారం ఆలయంలో ఏసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలపై వాక్యఉపదేశం చేయడం జరిగిందన్నారు.1 తండ్రి విరేమి చేయుచున్నారో విరు ఎరుగరు గనుక వీరిని క్షమించు 2 నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు 3 అమ్మ ఇదిగో నీ కుమారుడు 4 ఏలి ఏలిలామా సమక్త దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం 5 దప్పికొనుచున్నాననేను లేఖన భాగం నెరవేరినట్లు 6 సమాప్తమైనది చిరకను పుచ్చుకొని తలను వంచి ఆత్మను అప్పగించను 7 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఏసుక్రీస్తు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి 33½ సంవత్సరాలు అనేక అద్భుత కార్యములు చేసి లోక పాపపర్యారార్థం సిలువ వేయబడి తన్ను తాను తగ్గించుకొనినట్లు ప్రతి మానవుడు ఇతరుల పట్ల ప్రేమ అభిమానం కలిగి ఒకరినొకరు గౌరవించుకుని ప్రేమ త్యాగం కరుణ చూపాలని వాక్య సందేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్తారేట్ కమిటీ మెంబర్స్ పాముల భాస్కర్, ప్రభాకర్, లక్ష్మణ్ గూడెపు భాస్కర్, శంకర్ ప్రభాకర్, యాదగిరి, సాగర్, ఆశయ్య, వీరయ్య, మాధవ పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.