జనం న్యూస్ జనవరి 16 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరులసమావేశం నిర్వహించడం జరిగింది.ఈసమావేశంలోసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ జిల్లాకార్యదర్శిజే. రాజుమాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గం లోఅనేక సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా సమస్యలను వెంటనేపరిష్కరించాలని,ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గాఏర్పాటు చేయాలని,ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీకళాశాల (డిప్లోమా)మంజూరు చేయాలనీ,ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగామార్చాలని,ఎస్సారెస్పీ లింకు నుండి ఢీ 27 కెనాల్ ద్వారా ఖానాపూర్ నుండి కడెం మండలాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, ఈ కెనాల్ కు సైడ్ సిసి,తూములకు డోర్లు ఏర్పాటు చేసి కొన్ని వందల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలినీ,ప్రభుత్వ ఆసుపత్రి లలో అక్రమ డిప్యూటేషన్లు రద్దుచేసి పూర్తిస్థాయిలో డాక్టర్స్ మరియు సిబ్బందిని భర్తీ చేయాలని, అల్లంపల్లి గంగాపూర్ గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని, అల్లంపల్లి కేంద్రంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, చిగుమ వాగు పైన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అల్లంపల్లి గ్రామానికి సాగు భూములకు సాగునీరు అందించాలని దీనివలన దాదాపు 5 ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. త్రాగునీరు ఇబ్బందు లేకుండాచూడాలని, గిరిజనులకు, గిరిజ నేతరులకు పోడు సాగుదారులకుపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్,జిల్లా నాయకులు కే సర్దార్, గోపి నరసయ్య, దుర్గంలింగన్న, సింగరి వెంకటేష్ కుడుదుల రాజేష్,గోనేస్వామి,గూట్ల ప్రసాద్,మాన్కశ్రీనివాస్ రాములుతదితరులు పాల్గొన్నారు.