జనం న్యూస్ 16 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జాంగిర్) ఆలేరు మున్సిపల్ పరిధి లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ యువరైతు కిసాన్ సేవారత్నం అవార్డు గ్రహీత ఎలుగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఉన్న వ్యవసాయ కూలీలకు నష్టము జరుగుతున్నది అని ఆత్మీయ భరోసా పథకాన్ని వ్యవసాయ కూలీలకు అందరికీ వర్తింప చేయాలని ముఖ్యంగా ఆలేరులో ఉన్న వ్యవసాయ కూలీలు మహాత్మా గాంధీ జాతీయ పనికి ఆహార పథకం పనిచేశారు ఇప్పుడు ఆలేరులో ఉన్న వ్యవసాయ కూలీలు మున్సిపాలిటీ కారణం చేత ఇందిరమ్మఆత్మీయ భరోసా పథకం ప్రతి సంవత్సరానికి 12 వేల రూపాయలను స్కీమును కోల్పోతున్నారు అని ప్రజాస్వామ్యం లో ఉన్న ప్రజలు ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లు అవసరం కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అవసరం లేదా అని నిరుపేద వ్యవసాయ కూలీ లకు మరియు మున్సిపాలిటీల వ్యవసాయ కూలీలకు ప్రభుత్వ నిబంధనలు సవరిస్తూ అందరికీ న్యాయం చేకూర్చాలని తెలిపారు