జనం న్యూస్ 17.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు
విజేతలకు బహుమతి ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,సయ్యద్ ఉస్సాముద్దీన్
మెదక్ జిల్లా చేగుంట మండలం పరిదిలోని వడియారం గ్రామం లో నిర్వహించిన రాయల్ ప్రీమియం లీగ్ సీజన్ టూ విన్నర్ గా వడియారం గ్రామానికి చెందిన టీమ్ హామీగో హనార్స్, రన్నర్ గా డైనమిక్ బుల్స్ గా గెలుపొందారు వీరికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ బహుమతి ప్రధానం చేశారు, ఈ సందర్బంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటమి సహజమని , ఓడినవారు బాధపడకుండా గెలుపు కోసం ప్రయత్నం చేయాలని అన్నారు, గెలిచిన వారికి అభినందనలు తెలిపారు , ఈ కార్యక్రమం లో ఆర్గనైజింగ్ ఇంచార్జ్ దుబ్బాక కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సమోద్దీన్,, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ ముజామిల్, రామకృష్ణ గౌడ్, పల్లె క్రాంతి కుమార్, టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు