జనం న్యూస్. జనవరి. 16. నిజామాబాదు. రూరల్. (శ్రీనివాస్ )
సిరికొండ..యువతను నిర్వీర్యం చేయడానికే మద్యం, పదార్థలను అలవర్చుతున్న ప్రభుత్వాలు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే.మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి. నర్సయ్య..
యువత క్రిడాలతోపాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని -ఇల్లందు మాజీ ఎమ్మెల్యే మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి. నర్సయ్య. అన్నారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ ఎంఎల్. మాస్ లైన్ ఆధ్వర్యంలో, పార్టీ మండల కార్యదర్శి . రమేష్ అధ్యక్షతన "గడ్కోల్ అమరవీరుల స్మారకార్థం" జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా గ్రామంలో గల ఎర్రజెండాను ఎగరావేసి, భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు హార్పించి గ్రామంలో కవాతు నిర్వహించి క్రీడాలను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు: యువతను నిర్వీర్యం చేయడానికే మద్యం, పదార్థలను అలవర్చుతు, యువతను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి అన్నారు
. యువత తమకోసం, తమ కుటుంబం కోసం మాత్రమే యువత ఆలోచించకుండా సమాజం పట్ల బాధ్యతతో ఉద్యమించి మార్పు కోసం పోరాడాలి అన్నారు. గడ్కోల్ అమరుల కోసం ఈ క్రీడాలు నిర్వహించడం అంటే వారి ఆశయాలు సాధించడం కోసం పోరాడడమే నన్నారు. యువత మద్యం, మత్తు పదార్థాలను వదిలి ప్రగతిశీల ఉద్యమాల వైపు అటువేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్. మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు . ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు . రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి .దేవారం పి ఓ డబ్ల్యు. జిల్లా ప్రెసిడెంట్ గోదావరి, డివిజన్ నాయకులు. దామోదర్, బాబన్న, . లింబన్న, . రాంజీ, . కిషోర్, సాయరెడ్డి, . రమేష్, నరాగౌడ్, రమ, పుష్పలత, కిశోర్, బాల్ రెడ్డి, గంగామణి, అనిస్, .ఎర్రన్న, . ఆశిస్, తదితరులు పాల్గొన్నారు.