జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు.గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ రైతు మహోత్సవంలో ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరావు.తో.ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా రైతులకు కావాల్సిన పరికరాలు, ఉత్పత్తులు, సీడ్, ఫర్టిలైజర్ స్టాల్స్, వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు సెరికల్చర్, ఆయిల్ ఫెడ్ , అనుబంధ శాఖల స్టాల్స్ పరిశీలించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు రైతులకు నూతన సాంకేతిక విధానాలతో, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రైతు మహోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు. రైతు లేనిదే దేశం లేదని అలాంటి రైతన్నల పట్ల చిన్నచూపు చూడొద్దని అన్నారు. అకాల వర్షల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కేంద్రం పసల్ బీమా యోజన కింద ఇస్తున్న నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలనీ సూచించారు. తులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయాలనీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 500 బోనస్ అన్ని పంటలకు వర్తింప చేయాలని సూచించారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 12 వేలు సకాలంలో అందించే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు వ్యవసాయంలో యువ రైతులను ప్రోత్సాహించే విదంగా సబ్సిడీ సౌకర్యాలు అందించి, నూతన సాంకేతిక సేంద్రియ వ్యవసాయం అందించే విదంగా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు,