రైతులకు అండగా ఎంపీ ధర్మపురి అరవింద్
జనం న్యూస్, ఏప్రిల్ 20, జగిత్యాల జిల్లా,
ఇబ్రహీంపట్నం మండలం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఈరోజు ఎంపీ అరవింద్ పర్యటించారు, మండలంలోని పలు గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వడగండ్ల వర్షాలకి నష్టపోయిన పంటలను స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పరిశీలించాను. క్షేత్రస్థాయిలో పంట నష్టం పై సత్వరమే సర్వే నిర్వహించి, నష్టపోయిన పంటకి ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపూరి అరవింద్, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డాక్టర్ రఘు, డాక్టర్ యాదగిరి బాబు, సుఖేందర్ గౌడ్, రుద్ర శ్రీనివాస్, భాయి లింగారెడ్డి, బైన ప్రశాంత్, వెంకటేష్ మరియు బిజెపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు