ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):-
ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రము అర్ధవీడు సచివాలయంలో సమయం 11గంటలు అయినా ఆఫీస్ కు సిబ్బంది రాకపోవడం గమనార్హం. ప్రజలు పలు పనుల కోసం ఆఫీస్ కు వచ్చి వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు స్థానికంగా లేకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సచివాలయాలపై, ఎంపీడీఓ పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. మండల కేంద్రము లో ఇలావుంటే మిగతా గ్రామాల సచివాలయాల పరిస్థితి ఏంటో అని జనం గుసగుసలాడుకుంటున్నారు.