జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి.
పోషణ పక్వాడు 2025… పోషణ మాసం వారో స్సవలలో భాగముగా నిజామాబాద్ పట్టణం లోని కంటేశ్వర్ అంగన్వాడి కేంద్రం లో ఘనముగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్ తెలిపారు.. అంగన్వాడి లలో ప్రతి రోజూ గర్భిణీలకు పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తున్నారని రక్త హీనత రాకుండా పిల్లల ఎదుగుదల కొరకు మంచు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారని సీజన్ ఫుడ్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని యోగ సాధన చేయడం ద్వారా నార్మల్ ప్రసవాలు జరగడానికి అవకాశం ఉంటుంది అణి చెప్పరు.. యోగ డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ నిత్యం ఉదయం బ్రహ్మ ముహూర్తం లో లేవడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి అని యోగ తో నిత్య ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. తరువాత యోగ శిక్షకురాలు నమ్రతా నార్మల్ డెలివరీ కోసం అవసరమైన యోగ ఆసనాలు వేసి చూపించారు . గర్భిణీ స్త్రీలకు స్త్రీ మంతలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఆయుష్ విభాగం ఫార్మ సిస్ట్ లు న్యావా నంది పురు షో తం. ఉనప్రసాద్. ఐసిడిఎస్. సూపర్వైజర్ ప్రియదర్శిని యోగ శిక్షకులు విజయ భాస్కర్ రాజేందర్ భిక్షపతి అంగన్వాడి టీచర్లు రమాదేవి గర్భిణీ స్త్రీలు అంగన్వాడి పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనీ విజయవంతం చేశారు.