జనం న్యూస్, ఏప్రిల్ 22 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ కుమార్ )
సిద్దిపేట జిల్లా, ములుగు మండలం బస్వాపూర్‌లో ఈదురు గాలులతో కురిసిన వర్షంలో రామాంజనేయులు ఇల్లు పై పిడుగు పడటం జరిగిందని గ్రామస్తులు మీడియాకు తెలపటం జరిగింది . ఈ పిడుగు పాటు వల్ల ఇల్లు కూలిపోవడం జరిగింది, ఇంట్లో ఉన్న వాళ్లకు గాయలయ్యాయి. ఈ పిడుగుపాటు వల్ల నష్ట పోయినా కుటుంబానికి అధికారులు స్పందించి, ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.