ఫీజుల నియంత్రణపై యూఎస్ఎఫ్ఐ వినయం
జనం న్యూస్ :22 ఎప్రిల్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్ధిపేట
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి చంద్లాపురం మధు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. విద్యార్థుల భవిష్యత్‌కు సహాయపడే విధంగా విద్యా వ్యవస్థలో సమతుల్యత అవసరమని, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల విషయంలో ఒక పారదర్శక విధానం ఏర్పడాలని కోరారు. వీరి అభిప్రాయం ప్రకారం, డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రభుత్వం ఫీజులను నిర్ణయిస్తున్నట్టే, పాఠశాల విద్యా స్థాయిలో కూడా తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉండేలా కొన్ని మార్గదర్శకాలు ఉండాలి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పడి నిర్ణయాల్లో భాగస్వామ్యం కావాలని, జిల్లాలో ఫీజుల సమీక్షా కమిటీ ఏర్పాటు అయితే ప్రతి వర్గానికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
"విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా లక్ష్యం. అందులో భాగంగా సరసమైన ధరలకు అందుబాటులో ఉండే విద్యా అవకాశాలు అందరికీ కలగాలి," అని మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వినయ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.