జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి.
లెనిన్ జీవిత స్ఫూర్తితో, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆవిర్భావ స్ఫూర్తితో భారత దేశ విప్లవం కోసం పోరాడుదాం అని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గడ్కోలు గ్రామంలో జెండాను గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్ ఆవిష్కరించారు. అనంతరం డివిజన్ నాయకులు మార్క్స్ మాట్లాడుతూ ఘర్షణ లేకుండా చరిత్రలో మార్పు లేదని ఆయన అన్నారు. 1969 లో సిపిఎంఎల్ పార్టీ ఏర్పడిన నుండి అనేక ఉద్యమాలు నిర్వహించిందని, నిర్బంధాన్ని చవిచూసిందని ఆయన అన్నారు. విశాలమైన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, ప్రపంచంలో లేని శ్రమశక్తి, ప్రకృతి సంపద భారతదేశంలో ఉందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రజా సంపదను కొల్లగొడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15 ప్రకటించబడిందని, మనకన్న వెనుక విముక్తి పొందిన దేశాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాయని ఆయన తెలిపారు. కలిసి ఉన్న ప్రజలను కత్తులు దూసుకునేటట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు. దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్న మాటలను మరిచిపోయి దేశ ప్రజల జీవితాలతో చెలగాటమరే పాలకులు నేడు భారతదేశ భవిష్యత్తును అంధాకరంగా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజలను కూడగట్టి ఉద్యమిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ సిరికొండ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, ఎల్లయ్య నాయకులు చిన్న గంగాధర్, నర్సాగౌడ్,గాదె నర్సయ్య,పెద్దరాజగౌడ్,కట్ట పెద్ద సాయన్న,ఎంకన్న,తదితరులు పాల్గొన్నారు.