జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం : స్థానిక శ్రీ కొత్తమ్మతల్లికి విశాఖపట్నంకు చెందిన కుమారి పిన్నింటి లిఖిత 12`420 గ్రాముల బంగారు అభరణాలను గురువారం ఆలయ కార్యనిర్వాహాధికారి వాకచర్ల రాధాక్రిష్ణకు ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ కానుకలలో రెండు శతమానములు, ఒక బొట్టు, ఒక నత్తును ఉన్నాయని ఈవో రాధాక్రిష్ణ తెలిపారు. అలాగే కొత్తమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదానంకు, అలయ అభివృద్దికి దాతలు ముందుకు వచ్చి అర్థిక సహాయం అందజేయాలని ఆయన భక్తులకు కోరారు