జనం న్యూస్ 22 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, యువత హైదరాబాద్ KIYE Youth Transformation Mission మరియు చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహించే యువ సమ్మేళనం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 21న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కు సంబంధించి, ప్రత్యేకంగా రూపొందించిన బ్రౌచర్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు.
ఈ నెల 26న ఎస్విఎన్ నగర్ లో గల సుజాత కన్వెన్షన్ సెంటర్ మాజీ డి ఆర్ డి ఓ చైర్మన్, కేంద్ర రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారులు అయినటువంటి వ్యాప్తంగా డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిచే మోటివేషన్ క్లాస్ నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరత్ ఖాదర్ వాలి బాబా దర్గా అండ్ దర్బార్ షరీఫ్ డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్అంబేద్కర్, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొని ఉంటారు ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ సొసైటీ అధ్యక్షులు మరియు ప్రోగ్రాం ఇంచార్జ్ ఎం.రాము గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు ప్రోగ్రాం ఇంచార్జ్ వి.సత్యనారాయణ ప్రోగ్రాం టీం మెంబర్స్ పి.దుర్గాప్రసాద్ ఎస్.గురుప్రసాద్ ఎం.మధు కుమార్ , జి.లేఖ్య ఎం.ఉమ తదితరులు పాల్గొన్నారు.