జనం న్యూస్ జనవరి 16 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్
రంప ఎర్రంపాలెంలో హరిదాసును సన్మానించిన గ్రామ ప్రజలు. ధనుర్మాసం సందర్భంగా నెలరోజుల పాటు గ్రామంలో హరినామ సంకీర్తనతో నగర సంకీర్తన చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన సాతాన వైష్ణవ కుటుంబానికి చెందిన హరిదాసు చిరంజీవి బెజవాడ పవన్ కుమార్ ను గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించి నగదు బహూకరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్తు రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖు ఉంగరాల ఆది విష్ణు మాట్లాడుతూ, హరి అను రెండు అక్షరములు హరియించును పాత కంబులంబు జనాభా, హరి నీ నామ మహత్యము హరిహరిపొగడంగ వశమె హరి శ్రీకృష్ణ అని మహాకవి చెప్పినట్లుగా హరినామము మహా పాత కాలనునశింపజేసే శక్తివంతమైన నామము అటువంటి హరినామ సంకీర్తనతో నెలరోజుల పాటు గ్రామ ప్రజలకు వీనుల విందు చేసిన యువ హరిదాసు పవన్ కుమార్ ను గ్రామ పెద్దలు అందరూ కలిసి సత్కరించడం శుభ పరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పాటి రాంబాబు, పాటిరాజా, దాకారపు ధర్మరాజు, గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువకుడు సత్యం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని పరిరక్షించే ఇటువంటి కార్యక్రమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పవన్ కుమార్ లాంటి యువకుడు సంప్రదాయ కళను వదలకుండగా తాతల తండ్రుల నాటి వారసత్వాన్ని కొనసాగిస్తూ హరిదాసు వృత్తిని స్వీకరించి మన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా సత్సంగ ప్రముఖ కొరవటి సత్యనారాయణ, దేవలంక పెద్ద కాపు, గోసంశెట్టి సత్యనారాయణ, గోసంశెట్టి సూర్యనారాయణ, బెల్లంకొండ చిన్నారావు, చిక్కంరమేష్ బాబు, చిట్నూడి వెంకట పద్మరాజు, నరుకుల చిట్టిబాబు, గంట ఆదినారాయణ, పెది రెడ్ల రాజు మాస్టర్, నవనాసి చలపతి, సత్యవరపు రామారావు, పాలికి వెంకటరమణ, కేత నాగర్జున, సంగీత శ్రీనివాస్, చిక్కం దొరబాబు, సత్యం వెంకటేశ్వరరావు తదితరులు హరిదాసుని ఘనంగా శాలువాలతో సత్కరించారు