జనం న్యూస్ బద్రి
కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ. రామకృష్ణ మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు.ధ్వంసమైన పొలాన్ని పరిశీలించిన జనసేన మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా. రామాంజనేయులు
మండలంలోని పెద్దకొదమగుండ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మాడ. రామకృష్ణ వ్యవసాయభూమిలో పండించిన మొక్కజొన్న పంటను కొంతమంది గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. మాడ. రామకృష్ణ పొలానికి వెళ్లి చూసేసరికి పంట పొలం అంతా తొక్కి ధ్వంసం అయ్యి ఉండడంతో సదరు విషయాన్ని స్థానిక పోలిస్ స్టేషన్ లో జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా. రామాంజనేయులు దృష్టికి తీసుకోచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు బుసా. రామాంజనేయులు హుటాహుటిన పెద్దకొదమగుండ్ల గ్రామానికి చేరుకొని మాడ. రామకృష్ణ వ్యవసాయభూమిని పరిశీలించారు. ఈ సందర్బంగా బుసా. రామాంజనేయులు మాట్లాడుతూ అరుకాలం కష్టపడి పండించే పంటలను ధ్వంసం చేయడం మంచి పద్దతి కాదని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అయన కోరారు. అనంతరం మాడ. రామకృష్ణను బుసా. రామాంజనేయులు ఓదార్చి సంఘటనకు కారకులైన వారి పట్ల చర్యలు తీసుకునేలా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా బాధితుని ఫిర్యాదు మేరకు కారంపూడి ఎస్.ఐ వాసు , సి.ఐ టి. వి. శ్రీనివాసరావు, కొదమగుండ్ల చేరుకొని ధ్వంసం అయిన పొలాన్ని పరిశీలించారు. పొలాన్ని పరిశీలించిన వారిలో మండల జనసేన పార్టీ నాయకులు కేసానుపల్లి. కృష్ణబాబు, మండల ఉపాధ్యక్షులు కామేపల్లి. ఏడుకొండలు, కొదమగుండ్ల జనసేన నాయకులు గుబిలి.రామకృష్ణ, కర్నా. రాము, మర్రకుల. జనార్దన్, షేక్. సైదావలి, చచ్చు. కొండలలు తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.