ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లాఏప్రిల్ 22:
ఈ సందర్భంగా ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో గల గిరిజన వసతి గృహాలకు సుమారుగా నాలుగు నెలల నుంచి డైట్ బిల్లులు విడుదల కాకపోవడం వలన గిరిజన విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.దీంతో వసతి గృహాల్లో ఉన్న సిబ్బంది,విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు.ప్రస్తుత రేట్లుకు అనుకూలంగా డైట్ బిల్లులు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.మెరుగైన వసతులు ప్రభుత్వం కల్పించక పోవడంవలనే అనేక మంది గిరిజన విద్యార్థులు మరణాలు చెదుతున్నారు అని అన్నారు.గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం యొక్క మాటలు ఆకాశాన్ని తాగుతున్నాయి కానీ ఆచరణలు గడప దాటే పరిస్థితి లేదని అన్నారు.గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి వెంటనే వసతి గృహాలకు పెండింగ్లో ఉన్న డైట్ బిల్లలు చెల్లించాలని డిమాండ్ చేశారు.