జనం న్యూస్ 22ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.
తిర్యాని మండల మంతెన మల్ల గౌడ్ సతీమణి మాజీ జెడ్పిటిసి జ్యోతి అనిల్ గౌడ్ మాతృమూర్తి అనిల్ గౌడ్ అత్తమ్మ మంతెన మల్లక్క అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం పరమపదించడంతో మంగళవారం రోజున ఖానాపూర్ శాసనసభ్యులు వేడ్మ బొజ్జు, అసిఫాబాద్ మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అనిల్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరుమండ్ల వెంకటేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుల తదితరులు పాల్గొన్నారు.