జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం..
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ ఆధ్వర్యంలో రిథమ్ డ్యాన్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్న మెగా ఛాంపియన్ షిప్ 2025 పోటీలను విజయవంతం చేయాలని జమ్మికుంట వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అన్నారు.మంగళవారం నాడు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రోగ్రాం కి సంబంధించిన పోస్టర్ తో పాటు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ.. ఈనెల 26 27 తేదీలలో జమ్మికుంట పట్టణం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు క్లాసికల్ వెస్ట్రన్ జానపదం మిమిక్రీ మరియు పాటల పోటీలను ఈ ప్రాంత కళాకారులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.జమ్మికుంట ప్రాంతంలో ఇంత పెద్ద గొప్ప ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ ను ఈ సందర్భంగా వారు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, గ్రౌండ్ మాస్టర్, కలేగుర సంతోష్, ఆర్గనైజర్ చంటి తదితరులు పాల్గొన్నారు.