----------గోరంట్ల మండలం రెడ్డిచేరువుపల్లి వైసిపి సర్పంచ్ వినోద్ తెలుగుదేశం గూటికి చేరిక
--------బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో పెద్ద ఎత్తున వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు
----------ఎన్డీఏ కూటమి అభివృద్ధి చూసి అధికార పార్టీ వైపు అడుగులు
జనం న్యూస్ జనవరి 16 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం లో వైఎస్ఆర్ సీపీకి బిగ్ షాక్ తగిలింది.పార్టీలోని సర్పంచ్ తో పాటు మరికొంత మంది నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. రెడ్డి చెరువుపల్లి సర్పంచ్ వినోద్ కుమార్ తో పాటు మరో 29 కుటుంబాలు వైసీపీ పార్టీవీడీ తెలుగుదేశం పార్టీలోకి చేరారు .అదేవిధంగా మందలపల్లి పంచాయతీ కరావులపల్లి గ్రామం నుండి టిడిపి నాయకులు ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మ సమక్షంలో 13 మంది నాయకులతోపాటు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. వారందరికీ మంత్రి సవితమ్మ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల లోనే జరుగుతున్న అభివృద్ధిని చూసి టిడిపి వైపు ఆకర్షితులైనట్లు పార్టీలో చేరిన నేతలు చెబుతున్నారు. ప్రత్యేకించి పెనుకొండ నియోజకవర్గం ను మంత్రి సవితమ్మ ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చిన నేతలు, కార్యకర్తలను మంత్రి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పారు. నియోజకవర్గాన్ని అందరి సహకారంతో సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్బంగా మంత్రి పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అరాచక పాలన చూసిన అనంతరం ఏర్పడిన ఎన్డీఏ 7 నెలల పాలనను ప్రజలు భేరేజీ వేసుకుంటున్నారని. ఆరు నెలలలోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తుందని మంత్రి సవితమ్మ వివరించారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి వైపు దూసుకుపోతుందని మంత్రి తెలిపారు కార్యక్రమంలో గోరంట్ల మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.....