జనం న్యూస్ కాట్రేనుకున జనవరి 16
ఐ ఎస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ కళా వేదిక వరల్డ్ పొయిట్రీ అకాడమీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డు వారి తెలుగు కీర్తి జాతీయ ప్రతి భా పురస్కారానికి కాట్రేనికోన కి చెందిన ప్రస్తుతం హైదరాబాద్ నివాసి టైం స్కూల్ తెలుగు అధ్యాపకురాలు.. కవయిత్రి వజ్జల సీతా మహాలక్ష్మి ఎంపిక అయ్యారు. ఈ పురస్కారాన్ని జనవరి 21తేదిన విజయవాడ లో అందజేస్తారు ఈ విషయాన్ని కళా వేదిక వారు ఆహ్వానం పంపించారు... ఈ పురస్కారం పొందిన సీతా మహాలక్ష్మి ని పలువురు అభినందనలు తెలిపారు.. ఈ పురస్కారం కి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు