ఆగ్రహం వ్యక్తం చేశినా గుండెడు గ్రామ ప్రజలు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
కమలాపూర్ మండల్ గుండెడు గ్రామ ప్రజలు అక్రమ క్వారీ యాజమాని మనోజ్ రెడ్డి చర్యలపై మండిపడుతూ, హన్మకొండ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు అందజేశారు. ఆయన గుండెడు గ్రామం లో నడుపుతున్న అక్రమ మైనింగ్, హామీల ఉల్లంఘన, పర్యావరణ విధ్వంసం వంటి అనేక అంశాలను గ్రామ ప్రజలు ప్రశ్నించారు.ప్రజలు చేసిన ఆరోపణల ప్రకారం,,గ్రామ దేవాలయాల కోసం రూ. 25 లక్షల హామీ ఇచ్చిన మనోజ్ రెడ్డి, కేవలం రూ. 15 లక్షలకే పరిమితమయ్యాడు అన్నారు. క్వారీకి సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు నడుపుతూ, ప్రజల జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాడు అని తెలిపారు.పర్యావరణానికి తీవ్ర హానీ జరుగుతుండగా, పంటలు, పశువులు మరియు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వాపోయారు.అదేవిదంగా గ్రామస్థులు మూడు ప్రధాన డిమాండ్లు కలెక్టర్ కి వినతిగా తెలిపారు.1. మనోజ్ రెడ్డి పై కఠిన విచారణ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.2. గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలని, మాట్లాడారు. 3. అక్రమంగా నడుస్తున్న క్వారీని తక్షణమే ఆపేయాలని కోరారు.