జనం న్యూస్ ఏప్రిల్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం పై నేడు మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మునగాల మండల తహశీల్దార్ ఆంజనేయులు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ హాజరవుతున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించడంతోపాటు కొత్త చట్టంలోని ప్రయోజనాలను రైతులకు వివరించనున్నారని ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుందని,ఈ కార్యక్రమానికి మునగాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి రైతులు, ప్రజా ప్రతినిధులు,అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.