జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
మెట్రో ఉదయం టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ.
చిలకలూరిపేట నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవఅధ్యక్షులు,
చిలకలూరిపేట మండలం టిడిపి మాజీ సర్పంచ్ లింగంగుంట్ల తుళ్లూరుసుధాకర్ రావు జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ ములోని అమృత ఫ్యామిలీ డాబా లో గురువారం నిర్వహించారు.
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ,వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పలువురు నాయకులు ఆకాంక్షించారు.గతంలో ఆయన ప్రజలకు చేసిన సేవలను గురించి నాయకులు కొనియాడారు. అనంతరం మెట్రో ఉదయం టీవీ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను సుధాకర్ చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు.