జనం న్యూస్ ఏప్రిల్ 23:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలకేంద్రం లో బుధవారం రోజునాజమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకుల పైన జరిగిన హేయమైన చర్యకు నిరసనగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మండలంలోని అన్ని హిందూ యువజన సంఘాలు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణతల్లి మరియు ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర కొవ్వుతలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో హిందూ పర్యాటకులను ఒక్కొక్కరిగా వారి ఐడెంటిటీ కార్డులు చూసి కాల్చడం మరియు ఐడెంటి కార్డు లేని వారిని బట్టలు విప్పి హిందువుగా నిర్ధారించుకొని కాల్చడం చాలా హేయమైన చర్యగా పరిగణించారు . గతంలోకూడా పుల్వామా దాడి చేసినందుకు గాను ఒకింతకు పదింతల ఎలా అనుభవించారో అలాగే ఇట్టి చర్యకు పాల్పడిన వారిపై ఒకటి 100 రేట్లు ప్రతీకారం తీర్చుకుంటాం అని మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలో వీరపట్నం నర్సయ్యమరియు అన్ని కులాల హిందూ యువజన సంఘం నాయకులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు