జుక్కల్ ఏప్రిల్ 24 జనం న్యూస్
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ మే నెల అంతా ఒకేసారి సెలవు ఇవ్వాలని ఈరోజు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న పాల్గొని మాట్లాడుతూ మన పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ హెల్పర్లకు ఎండలు ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడం వలన ఒక నెల సెలవు ప్రకటించింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్ హెల్పర్ లందరికీ మే నెల అంతా అందరికీ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ. ఎండలు పెరగడం వలన. గర్భిణీ స్త్రీలు బాలింతలు. చిన్నపిల్లలు. ఎండలు తట్టుకోలేక సెంటర్స్ లో కూడా హాజరు శాతం తగ్గిపోతుందని. చాలా అంగన్వాడి సెంటర్లలో. సౌకర్యాలు లేవు కావున. ఎండలు దృష్టిలో పెట్టుకొని మే నెల అంతా అంగన్వా టీచర్ హెల్పర్లు అందరికీ సెలవు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో. జిల్లా గౌరవ అధ్యక్షులు. సురేష్ అన్న. జిల్లా అధ్యక్షురాలు. వి. కల్పన. జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎస్. బాబాయ్. అక్క. జిల్లా ఉపాధ్యక్షులు. బి. లక్ష్మి. ఆర్. అనసూయ. యాదమ్మ. సాయ కార్యదర్శులు. నందా. సిద్ధ లక్ష్మి. సురేఖ రాణి. యాదమ్మ. దేవకర్ణ. సునీత. కవిత. సెక్టార్ లీడర్స్. రాజశ్రీ. సుజాత. శ్వేత. అశ్విని. వెంకటలక్ష్మి. సుజాత. కామారెడ్డి జిల్లాలోని. ఐదు ప్రాజెక్ట్ పరిధిలోని. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ 300 టీచర్స్ పాల్గొన్నారు.