జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 24.
తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, పాస్ట్రైజెడ్ మిల్క్ అంశాలపై వ్యాసరచన, రిఫ్రీజీరేటర్ పై చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఇందులో 9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ క్లబ్ మెంటర్ గా వ్యవహరిస్తున్న ఒ.వి రవిశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాలకు పిల్లల్ని ముందుగా సంసిద్దుల్ని చేస్తూ అవగాహన కల్పించారు. సౌజన్య, శశిప్రియ, సాయి మానస ప్రధమ బహుమతిగా ₹1000 చొప్పున రూపశ్రీ,సరిత, కృష్ణవేణి ద్వితీయ బహుమతిగా ₹750 చొప్పున,సాయి మానస, లీల,రూపశ్రీ తృతీయ బహుమతిగా ₹500 లు చొప్పున సాయి కుమార్, స్పందన, సౌజన్య కన్ సొలేషన్ బహుమతిగా ₹250 ల చొప్పున ప్రధానో పాధ్యాయులు వై శ్రీనివాసరావు చేతుల మీదుగా అందుకున్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఒ. నరసింహారావు, పి కోటిమోహన్, జి. శోభారాణి, వి వి హెచ్ హేమలత ఎ. శంకర రెడ్డి , బి సుజాత, ఎస్. కిషోర్, డి. హేమలత, ఆర్. అచ్చయ్య, వీరబ్రహ్మం గార్లు పాల్గొని విద్యార్థులను అభినందించారు.