జనం న్యూస్ 17 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాకు మంజూరైన ఉపాధి హామీ నిధులు శత శాతం ఖర్చు చేయాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు. డ్వామా పీడీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. రోడ్లు, కాల్వలు అభివృద్ధి కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం మెటీరియల్ నిధులు రూ.331.32 కోట్లు మంజూరు చేస్తే కేవలం 75 శాతం నిధులకు మాత్రమే ప్రణాళికలు తయారుచేశారన్నారు. శత శాతం ఖర్చు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.