జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రజలందరూ ఖండించాలని నాయి బ్రహ్మణ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు టివి.దుర్లారావు అన్నారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. యాత్రికులపై ఉగ్రవాదులు విరుచుకు పడటాన్ని తప్పు పట్టారు. ఉగ్రవాదులను పట్టుకొని భారత ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు.